06-08-2025 10:33:30 PM
రాజాపూర్: రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ కార్యకర్తను బుధవారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి(Former Minister Charlakola Laxma Reddy) పరామర్శించారు. రాజాపూర్ మండలం చెన్నవెల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త గువ్వల నర్సింహులు మంగళవారం రోడ్డు ప్రమాదంలో గాయపడి నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. మాజీ మంత్రివర్యులు డా.సి.లక్ష్మారెడ్డి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ లకు సూచించారు.