పోలీసు అధికారుల సేవలు వెలకట్టలేనివి
01-03-2026 12:00 AM
హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్
బంజారాహిల్స్, ఫిబ్రవరి 28(విజయక్రాంతి): సుదీర్ఘ కాలం పాటు పోలీసు శాఖలో విశేష సేవలు అందించి పదవీ విరమణ పొందిన 19 మంది అధికారులకు హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ సుమారు 41 ఏళ్ల పాటు నిబద్ధతతో పనిచేసిన అనుభవజ్ఞులైన అధికారులు వెళ్లడం శాఖకు తీరని లోటని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫుట్ పెట్రోలింగ్ నుంచి ఆధునిక ఇన్నోవా పెట్రోలింగ్ వరకు వారు అందించిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిసిపి వెంకట లక్ష్మి, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శంకర్ రెడ్డి, కో-ఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




