బుద్ధారంలో బీరన్న బోనాల పండుగ
20-07-2026 12:00 AM
గణపురం,జులై 19 (విజయ క్రాంతి): గణపురం మండలంలోని బుద్ధారం గ్రామంలో బీరన్న బోనాల పండుగ వేడుకలను విడిదినేని శ్రీలత అశోక్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామంలోని గొల్ల, కురుమ సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సర్పంచ్ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు నిర్వహించగా, గ్రామ ప్రజలు ఐక్యతను చాటుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఉమ్మల రాజయ్య, కొడారి భద్రయ్య, ఉమ్మ ల శ్రీకాంత్, ఉమ్మల రామచందర్, భాస్కర్, విజేందర్, మారబోయిన ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, యువ కులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై బీరన్న స్వామి ఆశీస్సులు పొందారు.






