20 July, 2026 | 5:37 PM

Breaking News

శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •  

రామప్పను సందర్శించిన ఐపీఎస్ సోయి శివైన్

20-07-2026 12:00 AM

వెంకటాపూర్, జూలై 19 (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయాన్ని ఆదివారం ఏఎస్పీ సోయి శివైన్ ఐపీఎస్ సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్ర, కాకతీయుల శిల్పకళ వైభవం, యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు విశిష్టతను టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. అనంతరం ఏఎస్పీ రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. వారి వెంట స్థానిక ఎస్‌ఐ చల్లా రాజు, టూరిస్ట్ పోలీసులు బద్రు, శ్రీకాంత్, దశరథ్తో పాటు దేవాదాయ, పురావస్తు, టూరిజం శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.