20 July, 2026 | 5:38 PM

Breaking News

శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •  

ఊరికి కీడు సోకిందని..?

20-07-2026 12:00 AM

మహబూబాబాద్, జులై 19 (విజయక్రాంతి): ఒకరి తర్వాత ఒకరు.. వరస మరణాలతో తమ ఊరికి ఏదో కీడు సోకిందని.. ఊరి జనమంతా ఒకరోజు ఊరును వదిలి వనం బాట పట్టిన ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లి లో ఆదివారం జరిగింది. గ్రామంలో ఇటీవల పలువురు వ్యక్తులు మృత్యువాత పడడంతో, ఊరికి ఏదో జరగకూడనిది జరిగిందని, ఊరి జనమంతా ఉన్నఫలంగా ఆదివారం తెల్లవారుజామునే కల్లాపి చల్లకుండా వనవాసం వెళ్లాలని,

అక్కడే వంటావార్పు చేసుకుని సాయంత్రం వరకు వనంలోనే గడిపి తిరిగి ఇంటికి వస్తే ఊరికి పట్టిన కీడు తొలగిపోతుందనే ప్రచారంతో.. దాదాపు 230 కుటుంబాలకు చెందిన రెండువేల మందికి పైగా జనం ఊరి పక్కనే ఉన్న వనంలోకి వెళ్లి ‘బయటి వంటలు’ చేసుకుని అక్కడే ఆరగించారు. నాగరిక సమాజంలో, ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా,  ఈ రోజుల్లో కూడా ఇంకా మూఢనమ్మకాలను జనం విడిచి పెట్టడం లేదనడానికి గున్నేపల్లి ఘటన తాజా ఉదాహరణగా నిలుస్తోంది.