4 July, 2026 | 5:43 AM

బీఈఎల్ లాభం రూ.1,797 కోట్లు

22-05-2024 01:10 AM

న్యూఢిల్లీ, మే 21: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) కన్సాలిడేటెడ్  నికరలాభం ముగిసిన మార్చి త్రైమాసికంలో 30 శాతం వృద్ధిచెంది రూ. 1,797 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ రూ. 1,382 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఆదాయం రూ. 6,479 కోట్ల నుంచి రూ. 8,564 కోట్లకు పెరిగింది. కంపెనీ బోర్డు షేరుకు రూ.0.80 చొప్పున డివిడెండు సిఫార్సుచేసింది.