నిన్ను నువ్వు నమ్ముకో
అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విడాముయర్చి’. త్రిష, అర్జున్, ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. వారి పాత్రలను కూడా టీజర్‌లో రివీల్ చేశారు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కంప్లీజ్ చేసుకుంటోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
టీజర్‌లో అజిత్‌కుమార్ డిఫరెంట్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ‘ప్రపంచమంతా నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు.. నిన్ను నువ్వు నమ్ముకో..’ అనే కాన్సెప్ట్‌తో యాక్షన్ బేస్డ్ మూవీగా తెరకెక్కింది. సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దర్శకుడు మగిళ్ తిరుమేని ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.






