18 July, 2026 | 11:04 AM

తెలుగు తెరపై మ్యాక్స్

30-11-2024 12:00 AM

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘మ్యాక్స్’. వరలక్ష్మీ శరత్‌కుమార్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్లపై కలైపులి ఎస్ థాను నిర్మించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రం తెలుగులో డిసెంబర్ 25న రిలీజ్‌కు వస్తోంది. ఈ చిత్రంలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కిచ్చా సుదీప్ కనిపించనున్నారు. శుక్రవారం విడుదల చేసిన తెలుగు రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శేఖర్ చంద్ర; మ్యూజిక్: అజనీష్ లోకనాథ్.