బుల్లెట్ ట్రైన్ మాకొద్దు!.. శంషాబాద్ బహదూర్‌గూడలో టెన్షన్.. టెన్షన్
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్(Shamshabad) మండలం బహదూర్‌గూడలో(Bahadurguda) టెన్షన్ వాతావరణం నెలకొంది. బుల్లెట్ ట్రైన్(Bullet train) కోసం భూములు ఇచ్చేందుకు రైతుల నిరాకరిస్తున్నారు. హైడ్రా, రెవెన్యూ అధికారులు బహదూర్‌గూడ భూముల దగ్గరకు భారీగా చేరుకున్నారు. ఐదు రోజులుగా రైతుల ఆందోళన కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే భూములు తీసుకోవాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.
హైడ్రా, రెవెన్యూ అధికారుల తీరుపై రైతులు నిరసన తెలుపుతున్నారు. పోలీసులు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో రైతు నరసింహ స్రృహతప్పిపడిపోయాడు. రైతు నరసింహను ఆస్పత్రికి తరలిస్తుండగా తోటి రైతులు అడ్డుకున్నారు. రైతులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్వే నంబర్లు, 28, 68లోని 650 ఎకరాల భూమికి కంచె వేసేందుకు అధికారులు అక్కడికి చేరుకున్నారు. తమకు న్యాయం చేశాకే కంచె వేయాలని రైతులు వేడుకుంటున్నారు. బహదూర్ గూడలో భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది.






