30 July, 2026 | 2:03 AM

ఉద్యోగ విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ ఇవ్వాలి

30-07-2026 01:35 AM

ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించిన పట్టించుకోలేదు 

ఆగస్టు 8న చలో బస్సు భవన్ 

నిజామాబాద్, జూలై 29 (విజయక్రాంతి): ఆర్టీసీ ఉద్యోగులు పదవీ విరమణ చేసి ఏళ్ళు గడుస్తున్నా ప్రభుత్వం బెనిఫిట్స్ అందించడం లేదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ ఎల్ నారాయణ అన్నారు. బుధవారం నిజామాబాద్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరికి నిరసనగా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ మంజూరు చేయాలని ఆగస్టు 4న చలో బస్సు భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం గానీ ఇటు ఆర్టీసీ యాజమాన్యం కాదు తమ సమస్యల పరిష్కారం పట్ల నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం వల్లనే చలో బస్ భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ఎమ్మెల్యేల ద్వారా ఎంపీల ద్వారా ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ప్రభుత్వంగానే ఆర్టీసీ యాజమాన్యం గాని పట్టించుకోలేదన్నారు. జిల్లా డిపో స్థాయి అధికారులకు ఎన్నిసార్లు ధర్నాలు చేసి మెమోరాండం శిక్షణ స్పందన లేదన్నారు. రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకారం ఆగస్టు 4న చలో మధు భవన్ కార్యక్రమం పెట్టినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని సహకరించాలని కోరారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్‌ఎల్ నారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యేల ద్వారా ఎంపీల ద్వారా ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ప్రభుత్వం కానీ ఇటు ఆర్టిసి యజమాన్యం కానీ నిమ్మకు నీరెత్తినట్లు ఇప్పటివరకు చెల్లించడం లేదు జిల్లా డిపో స్థాయి అధికారులకు ఎన్నిసార్లు ధర్నాలు చేసి మెమోరాండమ్స్ ఇచ్చిన స్పందన లేదు. కావున రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకారం ఆగస్టు 4వ తారీఖున చలో బస్ భవన్ కార్యక్రమం పెట్టినాము. అన్ని వర్గాల వారు విశ్రాంత ఉద్యోగు లు పాల్గొని సహకరించాలని కోరుచున్నాము అని అన్నారు