ఫైనల్లో బెంగళూరు
- చిత్తుగా ఓడిన గుజరాత్
- పటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
- ఆర్‌సీబీ బౌలర్ల ఆల్‌రౌండ్ షో
* డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్ళింది. ధర్మశాల వేదికగా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆర్‌సీబీ గుజరాత్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో పటిదార్ విధ్వంసానికి కోహ్లీ, కృనాల్ మెరుపులు తోడవగా... బౌలింగ్‌లో డఫీ, రసిక్ సలామ్ దార్ టైటాన్స్‌ను దెబ్బకొట్టారు. ఈ విజయంతో ఆర్‌సీబీ వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది.
ధర్మశాల, మే 26: ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగళూ రు తన తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో సాల్ట్ బెంచ్‌కే పరిమితవగా వెంకటేశ్ అయ్యర్, కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభించారు. వీరిద్దరూ తొలి ఓవర్ నుంచే ధాటిగా ఆడారు. అయ్యర్ 7 బంతుల్లో 19 (3 ఫోర్లు, 1 సిక్సర్ ) పరుగులకు ఔటవగా.. కోహ్లీ, పడిక్కల్ ఇన్నింగ్స్ కొనసాగించారు. పవర్ ప్లేలో బెంగళూరు 76 పరుగులు చేసింది. కోహ్లీ (43), పడిక్కల్(30) రెండో వికెట్ కు 72 పరుగులు జోడించారు.
అయితే జాసన్ హోల్డర్ ఒకే ఓవర్లో వీరిద్దరినీ ఔట్ చేశాడు. కానీ ఆర్‌సీబీ జోరు మాత్రం ఆగలేదు. పటిదార్, కృనా ల్ పాండ్యా దుమ్మురేపారు. నాలుగో వికెట్ కు 45 బంతుల్లోనే 95 పరుగుల భాగస్వా మ్యం నెలకొల్పారు. కృనాల్ పాండ్యా 28 బం తుల్లో 43 (5 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులకు ఔటవగా.. పటిదార్ మాత్రం తన విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. గుజరాత్ బౌలర్లను ఉతికారేసిన పటిదార్ సిక్సర్ల వర్షం కురిపించాడు.
కేవలం 33 బంతుల్లోనే 93 (5 ఫోర్లు, 9 సిక్సర్లు) పరుగులు చేయగా.. చివర్లో జితేశ్ శర్మ (5 బంతుల్లో 15) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఫలితంగా ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచే తడబడింది. ఈ సీజన్‌లో గుజరాత్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఓపెనర్లు సాయి సుదర్శన్, గిల్ నిరాశపరిచారు. సాయి సుదర్శన్ 14, గిల్ 2 , బట్లర్ 29 , నిశాంత్ సంధు 5, హోల్డర్ డకౌటయ్యారు.
గుజరాత్ టైటాన్స్ పవర్ ప్లేలోనే సగం వికెట్లు కోల్పోయింది. ఇక్కడే ఆ జట్టు ఓటమి ఖాయమైపోయింది. వాషింగ్టన్ సుందర్ (8), రషీద్ ఖాన్ (8), రబాడ (9) పరుగులకే ఔటవగా కనీ సం 100 పరుగులైనా చేస్తుం దా అనిపించింది. అయితే విజయంపై ఆశలు లేనప్పటకి తెవాటియా మెరుపులు మెరిపించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
స్కోర్ బోర్డు :
బెంగళూరు ఇన్నింగ్స్ : 254/5 (పటిదార్ 93 నాటౌట్, కోహ్లీ 43, కృనాల్ 43 , పడిక్కల్ 30; హోల్డర్ 2/39, రబాడ 2/54)
గుజరాత్ ఇన్నింగ్స్: 168 (తెవాటియా 68, బట్లర్ 29, డఫీ 3/39, భువనేశ్వర్2/28, రసిక్ సలామ్ దార్ 2/24)






