30 August, 2026 | 4:03 AM

ఉపాధ్యాయులకు విద్యా ప్రమాణాల మీద అవగాహన ఉండాలి

30-08-2026 01:09 AM

కాంప్లెక్స్ హెచ్ఎం వెంకట్రాం రెడ్డి

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మక్కరాజ్ పేటలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు సంబంధించి చిన్న శంకరంపేట, చేగుంట మండలాలకు సంబంధించిన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ... ఉపాధ్యాయులకు,విద్యా ప్రమాణాల మీద, సబ్జెక్టుపై పూర్తి పరిజ్ఞానం ఉన్నప్పుడే,  విద్యార్థులకు బోధన  చేయగలుగుతారని, కాలానుగుణంగా  విద్యా వ్యవస్థలో వచ్చే మార్పులను స్వాగతించాలని, వాటికి అనుగుణంగా మన బోధనను మార్చుకోవాలని, విద్యార్థుల స్థాయికి తగిన బోధన చేయాలని  వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్  చల్లా లక్ష్మణ్, మంగ రాణి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు