30 August, 2026 | 3:14 AM

మిర్చి సాగులో మెళకువలపై రైతులకు అవగాహన

30-08-2026 01:17 AM

గణపురం,(విజయక్రాంతి): పరశురాంపల్లి రైతు వేదికలో మిర్చి సాగుపై రైతులకు అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. జాతీయ సుగంధ ద్రవ్యాల సుస్థిర కార్యక్రమంలో భాగంగా కాకతీయ రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో పోతన విద్యాసంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మిర్చి సాగులో పాటించాల్సిన పద్ధతులు, రసాయన ఎరువులు, పురుగుమందులను సరైన మోతాదులో వినియోగించడం, పురుగుల నియంత్రణ, మార్కెటింగ్ ద్వారా అధిక లాభాలు పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జాతీయ సుగంధ ద్రవ్యాల సుస్థిర కార్యక్రమం ప్రధాన శిక్షకుడు కె. ఉపేందర్ రెడ్డి రైతులకు శిక్షణ ఇచ్చారు.

భూపాలపల్లి రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి మిర్చితో పాటు ఇతర పంటల సాగుపై సూచనలు అందించారు. స్థానిక వ్యవసాయ అధికారి డి. ఐలయ్య ఎల్‌నినో ప్రభావంతో పంటలకు కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. బి. సురేశ్ పోషక పదార్థాల వినియోగం, వాటి ప్రయోజనాలను వివరించారు.ఈ

కార్యక్రమంలో  సర్పంచ్ ఉడుత సాంబయ్య యాదవ్, జాతీయ ప్రకృతి వ్యవసాయ సాగు జిల్లా ప్రధాన శిక్షకుడు కట్కూరి తిరుపతి రెడ్డి, వేశాల సాంబయ్య, వ్యవసాయ విస్తరణ అధికారి అమూల్య, రైతులు రవీందర్, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.