30 August, 2026 | 2:23 AM

పీహెచ్‌సీల్లో జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ

30-08-2026 01:11 AM

మహమ్మదాబాద్/ గండీడ్/ హన్వాడ: మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఏ. శ్రీనివాసులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా పీహెచ్‌సీల్లోని వ్యాక్సిన్ నిల్వలు, మందుల నిల్వలు, రోగ నిర్ధారణ సేవలు (ల్యాబ్ సర్వీసెస్), సిబ్బంది హాజరు వివరాలు, ఆసుపత్రుల్లోని పరిశుభ్రతను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ కాన్పుల సంఖ్యను పెంచాలని వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై మరింత నమ్మకం కలిగించేలా పనిచేయాలని సూచించారు.