1 July, 2026 | 11:06 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

మెరుగైన విద్యనందించాలి

10-04-2025 12:23 AM

ఐటీడీఏ పీఓ కుష్బూ గుప్తా

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్9 ( విజ యక్రాంతి):ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటిడిఎ పిఓ కుష్షుబు గుప్తా ఉపాధ్యాయులను ఆదేశించారు.బుధవారం రెబ్బెన మండల కేంద్రం లోని ఆశ్రమ పాఠశాలను కుష్బూ గుప్తా  ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పిఓ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతి రోజూ మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలన్నారు. 

సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలనీ సూచించారు.  దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరి యా వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.ప్రతిరోజు వంటగది, స్టోర్ రూమ్, తాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు భోదించారు. సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచించారు. గోలేటి లోనిఆశ్రమ పాఠశాలలో  ఆరో ప్లాంట్ పనిచేయందున పిల్లలు బోర్వెల్ నీళ్లు తాగడంపై ఆరా తీశారు.

మెనూ సక్రమంగా పాటించకపోవడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  మంగళవారం రోజున బ్రేక్ ఫాస్ట్ స్నాక్స్ ,  మజ్జిగ అందించకపోవడం, శానిటేషన్ సక్రమంగా లేనందున ప్రధానోపాధ్యాయుడు రవీందర్, వార్డెన్ మోహన్ దాస్ కు సోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఆసిఫాబాద్ లోని బాలుర ఆశ్రమ పాఠశాల లో మెనూ ప్రకారం వెజ్ బిర్యానీ పెట్టాల్సింది  పెట్టనందున, ఎలాంటి అనుమతి లేకుండా విధుల కు గైర్హజారు అయిన ఆర్ రాజేశ్వర్‌కు సోకా జ్ నోటీసు జారీ చేశారు. వార్డెన్, డిప్యూటీ వార్డెన్ ,స్టాఫ్ సమయానికి అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహించారు.