1 July, 2026 | 9:59 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

వరంగల్ సభను విజయవంతం చేయండి

10-04-2025 12:25 AM

మణికొండ మున్సిపల్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంభగళ్ల ధన్ రాజ్

రాజేంద్రనగర్, ఏప్రిల్ 9: బిఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చలో వరంగల్ సభను విజయవంతం చేయాలని మణికొండ మున్సిపల్ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంబగళ్ల ధనరాజ్ పిలుపునిచ్చారు. మణికొండ మున్సిపల్ నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి వెళ్ళనున్నట్లు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును అగ్ర నేతలు ఎండ కడతారని ఆయన చెప్పారు.

రాబోయే రోజుల్లో బిఆర్‌ఎస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుం దని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని తూర్పారబట్టారు.