calender_icon.png 11 November, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశ్రమ పాఠశాలలో మెరుగైన విద్య అందించాలి

11-11-2025 05:53:11 PM

ఏటిడబ్ల్యూఓకు సన్మానం

ఆదివాసి నేతల వినతి

కాటారం/మహాదేవపూర్ (విజయక్రాంతి): గిరిజన ఆశ్రమ పాఠశాలలో మెరుగైన విద్యను అందించాలని ఆదివాసి నాయకులు కోరారు. ఈ మేరకు మహాదేవపూర్ లోని గిరిజన సంక్షేమ అభివృద్ధి (మాడా) కార్యాలయంలో నూతనంగా విధుల్లో చేరిన ఏటిడబ్ల్యూఓ ఎన్ అజయ్ కుమార్ ను ఆదివాసీ సంఘాల నాయకులు సన్మానించారు. అనంతరం గిరిజన ఆశ్రమ పాఠశాలలో మెరుగైన విద్యను అందించాలని, వసతి గృహలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు కుడిమెత చిన్న సమ్మయ్య దొర, తుడుందెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మడే సత్యనారాయణ, జీసీసీ డైరెక్టర్ మేకల శంకరక్క, ఆదివాసీ యూత్ మండల కార్యదర్శి తొర్రెమ్ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.