పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో పది పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు మండల విద్యాధికారి శ్రావణ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనూ కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. బోయినపల్లి మండలంలో శనివారం నుండి ఏప్రిల్ 13 వరకు జరిగే పదవ తరగతి పరీక్షలు జరుగనుండగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాటు చేశారు. ఫ్యాన్స్, లైట్స్ త్రాగునీరు ఇతర సౌకర్యాలతో పాటు ఆరోగ్య వైద్య సిబ్బంది ఉంటారని అన్నారు.
మండలంలో బోయినపల్లి, విలాసాగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఉండగా బోయినపల్లి పరీక్ష కేంద్రంలో ఆదర్శ పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల, కోరం, స్తంభం పల్లి, బోయినపల్లి, ఒక ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాయనుండగా విలాసాగర్ పరీక్ష కేంద్రంలో విలాసాగర్, వెంకట్రావుపల్లి, నర్సింగ పూర్, కొదురుపాక పాఠశాల విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని విద్యాధికారి తెలిపారు. బోయినపల్లిలో 155 విద్యార్గులు పరీక్షలు రాయనుండగా 10 మంది ఇన్విజిలేటర్లు పని చేస్తారని విలాసాగర్ లో 88 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా 7 మంది ఇన్విజిలేటర్లు ఉంటారని తెలిపారు.




