calender_icon.png 11 November, 2025 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదిగా పట్టా పొందిన దైనంపెల్లి కవిత

11-11-2025 05:50:55 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): పేద కుటుంబంలో పుట్టి ఎన్నో ఒడిదుడుకులు ఛేదించుకుంటూ హనుమకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఉన్నతమైన న్యాయస్థానంలో అడుగుపెట్టి ఎం.ఏ (ఎమ్.హెచ్.ఆర్.ఎం) పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఎల్.ఎల్.బి కోర్సులో పట్టా సాధించి మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారని నిరూపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాయంపేట గ్రామస్తురాలైన దైనంపెళ్లి కవిత. ఆమె తల్లిదండ్రులైన సారయ్య రాజమ్మలకు ఆరుగురు సంతానం కాగా చివరి కూతురైన కవిత చిన్నతనంలోనే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, పేదవారికి సహాయం చేయాలని ఆలోచనతో చిన్ననాటి నుండి న్యాయవాది వృత్తిపై ఆసక్తితో కష్టపడి చదివి తెలంగాణ హైకోర్టు నుండి న్యాయవాది పట్టా సాధించడం పట్ల శాయంపేట మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా న్యాయవాది పట్టా పొందిన కవిత మాట్లాడుతూ జీవిత భాగస్వామిని కోల్పోయిన మనోధైర్యాన్ని కోల్పోకుండా నిరుపేద కుటుంబాలకు ఏదైనా చేయాలనే దృఢమైన సంకల్పంతో న్యాయవాది వృత్తిని ఎంచుకొని పట్టా సాధించాన్నారు. రాబోయే కాలంలో నిరుపేదలకు ఉచితంగా న్యాయం చేసే విధంగా తాను పాటుపడతానని తెలిపారు. తనకు అన్ని రకాలుగా అండగా నిలిచిన తల్లిదండ్రులతో పాటు బంధువులు, మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కవిత తెలంగాణ హైకోర్టు నుండి న్యాయవాది పట్టా పొందడంతో పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రవీందర్(బుజ్జి) ఆనందాన్ని వ్యక్తం చేశారు. కవిత జీవితంలో ఎన్నో కోల్పోయిన పట్టుదలతో చదివి ఉన్నతమైన న్యాయవాది పట్టా పొందడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు.