ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం
20-04-2024 01:40 AM
కలెక్టర్ అనురాగ్ జయంతి
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 19(విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్య సిబ్బందిని ఆదేశించారు. గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్, ముచ్చర్ల సబ్ సెంటర్లను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న సేవలు, ఓపీ రిజిష్టర్, మందుల నిల్వలు, టీకాల పంపిణీ, షుగర్, బీపీ, ఎనీమియా వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, జిల్లా వైధ్యాధికారి సుమన్ మోహన్‌రావు, వైద్యాధికారులు ఉన్నారు.






