22 May, 2026 | 2:15 PM

కులమతాల పేరుతో ప్రచారం చేయొద్దు

20-04-2024 01:40 AM

l జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశం

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 19 (విజయక్రాంతి) : పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కులమతాల పేరుతో ప్రచా రం చేయకూడదని, ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో కలిసి శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి పొందాలని చెప్పారు. అనంతరం సీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నామినేషన్లు మొదలైనందున నగరంలో 144 సెక్షన్ విధించి నట్లు వివరించారు. రాత్రి 10 గంటల తర్వాత ప్రచారం చేయకూడదని పేర్కొన్నారు. సమావేశంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్, సికింద్రాబాద్ ఆర్వో హేమంత్ కేశవ్ పాటిల్, కంటోన్మెంట్ ఆర్వో మధుకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

దీర్ఘకాలిక సెలవుల రద్దు.. 

పార్లమెంటు ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు సిబ్బంది కొరత కారణంగా ఉద్యోగుల దీర్ఘకాలిక సెలవులను రద్దు చేస్తున్నామని, దీర్ఘకాలిక సెలవులు తీసుకున్న వారితో పాటు విదేశీ ప్రయాణాలకు అనుమతి పొందిన వారు  ప్రయాణాలను రద్దు చేసుకుని తక్షణమే రిపోర్ట్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.