22 May, 2026 | 1:48 PM

డిప్యూటీ కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు

22-05-2026 01:10 PM

మేడ్చల్మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి డిప్యూటీ కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌పై(Deputy Collector Vamsi Mohan Assets) నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల (DA) కేసు సంబంధించి, తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Bureau ) అధికారులు ఆయన నివాసంతో పాటు మరో ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. అక్రమాస్తులకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించేందుకు, రంగారెడ్డి జిల్లా ఏసీబీ ప్రత్యేక బృందాలు ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహిస్తున్నాయి. మోహన్ గతంలో శేరిలింగంపల్లి, ఇతర ప్రాంతాల్లో RDOగా పనిచేశారు.

మోహన్ తన ఆదాయానికి మించి ఆస్తులను కూడగట్టారన్న ఆరోపణల నేపథ్యంలో వంశీ మోహన్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. భారీగా ప్రభుత్వ భూములు కాజేసినట్లు వంశీ మోహన్ పై ఆరోపణలున్నాయి. అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురంలో 8 ఎనికరాల భూమి కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వంశీ మోహన్‌ భూములను తన మామ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి రియల్టర్ కు ధారాదత్తం చేశారు. ఓ రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ చేయించుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అధికారులు వంశీ మోహన్ పై వందల కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్(Medchal Deputy Collector Vamsi Mohan) ఇంటితో పాటు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనీ(ULC) అర్బన్ లాండ్ సీలింగ్ లో సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.