1 August, 2026 | 5:51 PM

Breaking News

వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •   ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •   ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •   రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •  

గ్యారెంటీలపై జాగ్రత్త

02-11-2024 01:19 AM

రాష్ట్రాల బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలి

ఎన్నికల హామీలపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, నవంబర్ 1: ఎన్నికలపుడు ఇచ్చే హామీలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవా రం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాల బడ్జెట్‌ను పరిగణలోకి తీసుకోకుండా అనవసర హామీలను ప్రకటించవద్దని త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే జార్ఖండ్, మహారా్రష్ట్ర రాష్ట్రాల కాంగ్రెస్ చీఫ్‌లకు సూచించారు. ప్రణాళిక లేకుండా హామీలివ్వడం ద్వారా భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇది ముందు తరాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైతే ప్రజల్లో నమ్మకం పోతుందని.. దీని ప్రభావం తదుపరి ఎన్నికలపై పడే అవకాశం ఉంటుందన్నారు.