సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి
జహీరాబాద్,(విజయక్రాంతి): సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సందేహాలు వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని జరా సంఘం ఎస్ఐ పాటిల్ క్రాంతి కుమార్ సూచించారు. శనివారం జరా సంఘం మండలం ఈదులపల్లి గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ సంగీత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మండల అభివృద్ధి అధికారి పి మంజుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై పాటిల్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ. సైబర్ క్రైమ్ లో భాగంగా ఎవరైనా తమ టెలిఫోన్ చేసి ఓటిపి చెప్పమని అడిగితే చెప్పవద్దని ఆయన సూచించారు. గుర్తుతెలియని ఫోన్ వస్తే మాట్లాడరాదని వాట్సాప్ కాల్ వీడియో కాల్స్ ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయకూడదని టెలిగ్రామ్ ట్రాకింగ్ అవుతుందని తెలిపారు.
ఆన్ లైన్ గేమింగ్ నెట్వర్క్ ద్వారా మోసపోవద్దని ఆయన సూచించారు .గంజాయి డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలని ఆయన హితవు పలికారు .వీటిని సేవించడం వల్ల యువత తన జీవితాన్ని కోల్పోతారని ఆయన సూచించారు పేకాట వంటివి చట్ట విరుద్ధమని ఆడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇతర బెట్టింగులు ఆడి నష్టపోవద్దని ఆయన సూచించారు ప్రస్తుతం వర్షాకాలం కావడం వల్ల చెరువులలో కుంటలలో ఈతకు వెళ్ళవద్దని దీని ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని దీని ద్వారా తమ తల్లిదండ్రులు వేదన వర్ణాతీతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
వర్షం పడుతున్న సమయంలో వాగులు వంకలు పారుతుండగా వాటిని దాటవద్దని వాటిని చూసేందుకు కూడా వెళ్ళవద్దని వాగులు వంకలు దాటుటకు సహాసం చేయరాదని ఆయన తెలిపారు. వర్షం పడుతున్న సమయంలో కరెంటు స్తంభాలకు సపోర్ట్ వైర్లకు దూరంగా ఉండాలని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి హెల్మెట్ ధరించాలని, ఇతర వాహనదారులు సీట్ బెల్టు తప్పనిసరిగా ధరించి వాహనాన్ని నడపాలన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ చేయాలని ఆయన తెలిపారు చట్ట విరుద్ధమైన ఏ పనులు చేసిన ఉపేక్షించమని చట్టానికి లోబడి అందరూ నేర్చుకోవాలని ఎస్సై సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లు ప్రజలు పాల్గొన్నారు.






