1 August, 2026 | 5:11 PM

నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం

01-08-2026 04:29 PM

జిల్లా సంక్షేమ అధికారిని జె. స్వర్ణలత లేనినా

కొత్తగూడెం టౌన్,(విజయక్రాంతి): బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలలు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని, ఆ తర్వాత మరో సంవత్సరం పాటు తల్లిపాలు ఇవ్వడం తల్లి, బిడ్డల ఆరోగ్య సంరక్షణకు రక్షణ కవచం లాంటిదని జిల్లా సంక్షేమ అధికారిని జే స్వర్ణలత లేనినా అన్నారు. కొత్తగూడెం బస్టాండ్ లో తల్లి పాలిచ్చే గదిని లాంఛనంగా శనివారం ప్రారంభించి, బాలింతలకు తల్లిపాల అవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రసవించిన మొదటి గంటలోపే తల్లిపాలు ఇవ్వడాన్ని ప్రారంభించేలా తల్లులకు సహకారం అందించాలని, తల్లిపాలే నవజాత శిశువును అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి.

బిడ్డ పుట్టినప్పటి నుండి ఆరు నెలల నిండే వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించడం, ఈ ఆరు నెలల్లో బిడ్డ ఎదుగుదల మరి అభివృద్ధికి అవసరమైన పోషకాలన్ని తల్లిపాలలోని లభిస్తాయన్నారు.  ఇలాంటి ఇతర పదార్థాలు తినిపించకుండా, త్రాగించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే తల్లి బిడ్డల ఆరోగ్య భద్రత ఉంటుందన్నారు. మారుతున్న కాలానుగుణంగా బిడ్డ పుట్టిన వెంటనే తేనే, పంచదార లాంటి మూఢనమ్మకాలు నమ్మకుండా ముర్రుపాలె ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం అర్బన్ సిడిపిఓ, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది, మహిళా సాధికారిత జిల్లా బృందం, ఆర్టీసీ డిపో మేనేజర్, ఆర్టీసీ సిబ్బంది, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.