2 August, 2026 | 8:19 PM

భక్తులతో కిటకిటలాడిన భద్రాద్రి

27-05-2024 02:07 AM

భద్రాచలం, మే 26: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, పాల్వంచ, పిడుగురాళ్లలోని పెద్దమ్మ తల్లి ఆలయాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. సెల వు కావడంతో తెల్లవారుజాము నుంచే రామయ్యను వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు భారీగా రావడంతో ఉచిత దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తుల రామనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఎండల దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో రమాదేవి చలువ పందిళ్లు, ఉచిత మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశారు. పాల్వంచలోని జగన్నాథపురం పెద్దమ్మతల్లి ఆలయంలోనూ ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.