సీఎం రేవంత్‌రెడ్డితో బాలకృష్ణ భేటీ
27-05-2024 02:08 AM
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆదివారం ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ట్రస్టు సభ్యులు కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కాసేపు ఇద్దరు పలు సమస్యలపై ముచ్చటించారు. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరువాత బాలకృష్ణ ఆయనను కలవడం ఇది రెండోసారి. అంతకుముందే డిసెంబర్‌లో సచివాలయంలో భేటీ అయ్యారు. అదేవిధంగా జయజయహే తెలంగాణ గేయంపై అందెశ్రీ, సంగీత దర్శకులు కీరవాణితో సీఎం రేవంత్ చర్చించారు.






