2 August, 2026 | 9:27 PM

మాకు చావే శరణ్యం

27-05-2024 02:07 AM

దుబాయ్‌లో చిక్కుకున్న వ్యక్తిని రప్పించండి 

లేదంటే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటాం

బాధితుడి కుటుంబసభ్యులు

జగిత్యాల, మే 26 (విజయక్రాంతి): ఉపాధి కోసం విదేశానికెళ్లి మోసపోయాయని, తనను రక్షించాలంటూ జగిత్యాలకు చెందిన గొల్లపల్లి రాజేశ్ అనే వ్యక్తి వీడియో విడుదల చేశాడు. అతనిని స్వదేశానికి రప్పించకపోతే చావే శరణ్యమని, మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని రాజేశ్ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెలితే జగిత్యాల పట్టణం కటికెవాడకు చెందిన రాజేశ్ (39) బతుకుదెరువు కోసం డిసెంబర్‌లో ఆజాద్ వీసాపై దుబాయ్‌కి వెళాడు. ఎంప్లాయిమెంట్ వీసా ఉన్నప్పటికీ, సరైన ఉద్యోగం లేక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ఒక ముఠా మోసపూరిత మాటలు నమ్మి ఓ కేసులో ఇరుక్కుపోయాడు.

బ్యాంకు ఖాతా ను తెరిపించిన ఆ ముఠా అతని అకౌంట్ దారా పలు లావాదేవీలను చేశారు. అనుమానాస్పద లావాదేవీలపై దర్యాప్తు జరిపి న దుబాయ్ పోలీసులు కేసు నమోదు చేశా రు. కేసు పూర్తయ్యేవరకు నగరం దాటి వెళ్లకుండా రాజేశ్‌పై ఆంక్షలు విధించారు. రాజేశ్‌ను రక్షించాలని అతని కుటుంబసభ్యులు కొంతమంది నాయకులను కలిశా రు. ఈ విషయాన్ని సీఎంఓ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి తగిన సహాయం కోసం సీఎస్ దారా దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్, ఢిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయాన్ని సంప్రదించారు. రాజేశ్ తండ్రి పక్షవాతంతో మంచాన పడగా తల్లి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.