చేసేది చీరల బేరం.. ఆడోళ్లకి ఆమడ దూరం

06-05-2024 12:05:00 AM

రాజ్ తరుణ్  మనీషా కందుకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘భలే ఉన్నాడే’. రవి కిరణ్ ఆర్ట్స్ పతాకంపై ఎన్.వి. కిరణ్ కుమార్ నిర్మిస్తన్న ఈ సినిమా టీజర్ ఆదివారం సాయంత్రం విడుదలైంది. ఆడవారికి చీరలు కట్టే పనిచేసే పాత్రలో కనపడనున్న రాజ్ తరుణ్, ఈ సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనున్నారు. “మన తొడ మనం కొట్టుకుంటే మగాడంటారు. వేరేవాడి తొడ పట్టుకుంటే తేడాగాడంటారు” అంటూ ట్రైలర్‌లో వీటీవీ గణేష్ చెప్పే డైలాగ్ హాస్య ప్రియులకు నచ్చేలా వుంది. శ్రీకాంత్ అయ్యంగార్, అభిరామి తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించనున్నారు. ‘గీతా సుబ్రమణ్యం’, ‘పెళ్లి గోల 2’ వంటి వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న  జె శివసాయి వర్ధన్  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి డీవోపి: నగేష్ బనెల్, సంగతం: శేఖర్ చంద్ర,  ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్.