8 May, 2026 | 2:59 PM

అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలి

19-05-2024 12:00 AM

ఎన్నికల పుణ్యమా అని గ్రామాల్లో కొన్ని నెలలుగా అభివద్ధి పనులు పూర్తిగా ఆగిపోయాయి.  గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ గుంతలుగా మారిపోయాయి. దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆచితూచి నిధులు ఖర్చు చేస్తుండడంతో కొత్తగా రోడ్ల నిర్మాణం, కాలువల పూడికలు వంటివి కూడా చేపట్టడం లేదు. వర్షాకాలం రానున్నందున తక్షణం ఈ పనులపై దృష్టిపెట్టాలి. లేకుంటే వర్షాకాలంలో గ్రామాల్లో రైతులతో పాటు సామాన్య జనం ఇబ్బందులు పడతారు.

రాములు నాయక్, రామాయం పేట, మెదక్ జిల్లా