30 July, 2026 | 5:06 PM

ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌ ప్రమాణ స్వీకారం

24-06-2024 10:29 AM

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్లమెంటు తొలి సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. 18వ లోక్‌సభ తొలి సెషన్‌కు ముందు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ సోమవారం లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహతాబ్‌తో ప్రమాణం చేయించారు. నేడు ప్రారంభమయ్యే లోక్‌సభ సమావేశానికి మహతాబ్  అధ్యక్షత వహించనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీతో మొదట ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.