30 July, 2026 | 5:51 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

బెల్ట్‌షాపుల మూసివేతకు పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ తీర్మానం

30-07-2026 04:58 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామంలో నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులను తక్షణమే మూసివేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. బెల్ట్‌షాపుల కారణంగా గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ భిక్కనూర్ ఎస్‌ఐ అనిల్‌కు వినతిపత్రం అందజేశారు. అక్రమ మద్యం విక్రయాలను అరికట్టి గ్రామంలో శాంతిభద్రతలు, సామాజిక వాతావరణం పరిరక్షించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోడూరి సాయా గౌడ్, ఉపసర్పంచ్ పట్లూరి చైతన్య కొండల్‌రెడ్డి, వార్డు సభ్యులు రాదా నర్సింలు, రాదా పద్మావతి నర్సింలు, నట్ట లింగం, నాలిక రాకేశ్, గిజువెల్లి మాధవ రెడ్డి, నడిపోల్లా శ్యామల రామస్వామి, వడ్ల శ్రీనివాస్, బుడ్డ సుగుణ సత్తయ్య, కనకదుర్గ, కంతి వసంత నర్సింలు, పెద్దోల్ల అనిల్, పిల్లి బాబు, ఈర సాహితి స్వామి, మంద ఎల్లం రాజు పాల్గొన్నారు.