30 July, 2026 | 6:11 PM

బీఆర్ఎస్‌‍ను వీడుతున్న ఎమ్మెల్యేలపై కేటీఆర్ స్పందన

24-06-2024 10:02 AM

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో స్పందించారు. అధికారంలో ఉన్న వారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగా ఉంటుందన్నారు. 2004-06 మధ్య కూడా తమ పార్టీ నుంచి ఫిరాయింపులు జరిగాయని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రజాఉద్యమం ఉద్ధృతంతో తెలంగాణ గట్టిగా ప్రతిస్పందించింది. కాంగ్రెస్ పార్టీ తలవంచక తప్పలేదని కేటీఆర్ పేర్కొన్నారు.  చరిత్ర పునరావృతం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. 

జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్  కాంగ్రెస్ పార్టీలో చేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో కి ఆహ్వానించారు. ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అదే రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకొని ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు సమాచారం. ఇదే బాటలో ఇదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే రేపోమాపో చేరనున్నట్లు సమాచారం.