15 July, 2026 | 4:55 AM

శ్రీమతిగారికి భాస్కర్ బుజ్జగింపు

20-06-2024 12:05 AM

‘పలుకే నీది ఓ వెన్నపూస.. అలకే ఆపే మనసా’ అంటూ శ్రీమతి అయిన మీనాక్షి చౌదరితో విన్నవించుకుంటున్నారు దుల్కర్ సల్మాన్. వీరిద్దరూ జంటగా తెరకెక్కిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా బుధవారం ఈ సినిమా నుంచి ‘కోపాలు చాలండి శ్రీమతిగారు..’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేశాయి చిత్ర వర్గాలు. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ గీతానికి శ్రీమణి సాహిత్యం సమకూర్చగా గాయకులు విశాల్ మిశ్రా, శ్వేత మోహన్ కలసి ఆలపించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెలుగ, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న తెరపైకి రానుంది.