15 July, 2026 | 5:09 AM

వరుణ్ సందేశ్‌కు నింద మంచి కమ్ బ్యాక్

20-06-2024 12:05 AM

ముందు నుంచీ ఈ పాత్రకు వరుణ్ సందేశ్ సరైన ఎంపిక అనుకున్నాను. ఆయనకు కూడా కథ నచ్చడంతో ‘నింద’కి సినిమా రూపమివ్వగలిగాం. ఆయనకు ఇది మంచి కమ్ బ్యాక్ అవుతుంది. కాండ్రకోట మిస్టరీ అంటూ విడుదల చేసిన ‘నింద’ పోస్టర్ చూసి అందరూ దెయ్యం సినిమా అనుకున్నా రు. టీజర్ చూసిన తర్వాత ఆ అభిప్రాయం పోయింది. వాస్తవిక ఘటనలతో కూడిన సన్నివేశాలతో పాటు కల్పితమైనవి కూడా సినిమాలో ఉంటాయి. నిర్మాతల కోసం ప్రయత్నించే సమయంలో వేరే వాళ్లు ఎందుకు? నేనే నిర్మించవచ్చు కదా అనిపించింది.

అందుకే నిర్మాతగానూ మారాను. అయితే నాకు క్రియేటివ్ ఫీల్డ్ అంటేనే ఇష్టం. సినిమా తీయడం కంటే రిలీజ్ చేయడం ఎంత కష్టమో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. కెమెరామెన్ పీఎస్ వినోద్ గారి వద్ద పని చేసిన రమిజ్, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ వద్ద పనిచేసిన సాంతు ఓంకార్ మంచి ఈ సినిమాకి పనిచేశారు. మలయాళం సినిమాలు చూసి ఇలాంటి చిత్రాలు మన వద్ద ఎందుకు రావని అనుకునేవారికి ఈ సినిమా ఓ సమాధానం కానుంది. కొన్ని కథలు సిద్ధం గా ఉన్నాయి. ‘నింద’ ఫలితం వాటి గమనాన్ని నిర్ణయించనుంది.