28 June, 2026 | 3:09 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

భట్టి, శ్రీధర్‌బాబు దుర్గమ్మ దర్శనం

10-07-2024 04:18 AM

హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): విజయవాడ కనకదుర్గ అమ్మవారిని డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం దర్శించుకున్నా రు. ఈ  సందర్భంగా వేద పండితులు వారి కి స్వాగతం పలికారు. ఆమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన తర్వాత ఆశీర్వాదం చేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందచేశారు. సోమవారం మంగళగిరిలో నిర్వహించిన వైఎస్సార్ 75వ జయంతి సభలో తెలంగా ణ మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు పాల్గొన్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా విక్రమార్క మాట్లాడుతూ.. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వ పాలనలో సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్టు తెలిపారు. ప్రపంచంతో పోటీపడి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో చల్లగా ఉండేలా దీవించాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు.