18 April, 2026 | 9:07 AM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ

14-06-2025 12:37 AM

మునిపల్లి, జూన్ 13:  మండల పరిధిలోని చిల్లపల్లి గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు సంబంధించి ఎంపీడీవో హరినాథన్రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల  అధ్యక్షుడు పిల్లోడి సతీష్, రాజుదొర, రాంరెడ్డి, చిల్లపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు నల్యకంటి వీరన్న పాటిల్, మాజీ సర్పంచ్ పట్లల వీర్ణన పాటిల్, పంచాయతి కార్యదర్శి రాము, రాజు, శివశంకర్, చిన్న పాటిల్, ఎండీ అప్సర్, ఎండీ రజాక్, ఎండీ ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు.