21-02-2026 02:04:48 AM
చిన్న చింతకుంట, ఫిబ్రవరి 20: మండల మండల కేంద్ర పరిధిలోని పల్లమర్రి గ్రామంలో శుక్రవారం రూ 10 లక్షల నిధులతో మహిళా సమైఖ్య భవన నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి హాజరై భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు.
ప్రాథమికనిస్తూ ప్రతి పనిని అభివృద్ధి వైపు ముందుకు తీసుకుపోతున్నామని తెలిపారు. అనంతరం పల్లమరి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు నర్సింహారెడ్డి గారి కుమార్తె వివాహానికి హాజరై, తదనంతరం చిన్నచింతకుంట మండల కేంద్రంలో అఖిల్ రెస్టారెంట్ పూణే బాలరాజ్ కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఎమ్మెల్యే జిఎంఆర్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.