calender_icon.png 21 February, 2026 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లను వేగంగా నిర్మించండి

21-02-2026 02:03:29 AM

నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్నగర్ అర్బన్, ఫిబ్రవరి 20 :  మండలంలోని పోతన పల్లి గ్రామంలో  నిర్మిస్తున్న  ఇందిరమ్మ ఇళ్లను జిల్లా  కలెక్టర్ విజయేందిర బోయి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణ పురోగతి విషయాలు తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పోతంపల్లి గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేశారు. గ్రామంలో పూర్తయిన ఇళ్లను కలెక్టర్ సందర్శించి, లబ్ధిదారులు నిర్మాణానికి ఎంత వ్యయం చేశారు, బిల్లులు సమయానికి అందుతున్నాయా లేదా అనే విషయాలను ఆరా తీశారు.

అలాగే  ఇళ్ల ప్లింత్ ఏరియా ఎంత ఉంది, ఆమోదించిన నమూనాకు భిన్నంగా ఏవైనా మార్పులు జరిగాయా అనే  వివరాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్కు వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ఆదేశించారు.  లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేయగా, కలెక్టర్ కూడా పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.

బిల్లులు పెండింగ్లో ఉండకుండా సమయానికి విడుదల చేసి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. బండమీదిపల్లి దగ్గర దుర్గాబాయి మహిళాశిశు వికాస కేంద్రము లో ఏర్పాటుచేసిన గ్రామపంచాయతీ సర్పంచ్ ల ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వెంకట్ ఉపేందర్ రెడ్డి, డీఈ విజయ్ కుమార్, ఏఈ ఝాన్సీ, పంచాయతీ కార్యదర్శి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.