భూ సమస్యలు పరిష్కరించేందుకే భూభారతి
అదనపు కలెక్టర్ రాంబాబు
సూర్యాపేట, జూన్ 12 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కారం అవుతాయని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. గురువారం సూర్యాపేట మండలంలోని పిల్లలమర్రి గ్రామంలో జరుగుతున్న రెవిన్యూ సదస్సు లో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టం రైతులకి ఎంతగానో మేలు జరుగుతుందన్నారు. ఈనెల 20 వరకు జరిగే రెవిన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తదుపరిపిల్లలమర్రి గ్రామంలో నిర్వహించిన రెవిన్యూ సదస్సు ద్వారా 169 ధరఖాస్తులు సమర్పించారన్నారు.
అనంతరం పిల్లలమర్రి గ్రామంలోని రేషన్ దుకాణంను సందర్శించి నిల్వలు, పంపిణీ రిజిస్టర్ను పరిశీలించారు. జిల్లాలోని 610 రేషన్ షాప్ లకి 17,577 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం వచ్చినందున ప్రజలు ఎవరు అధైర్య పడకుండా ఉండాలని చివరి లబ్ధిదారునికి సన్న బియ్యం అందేలా జూన్ 30 వరకు పంపిణి చేయటం జరుగుతుందన్నారు. అలాగే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సైతం పరిశీలించారు. ఈయన వెంట తహసీల్దార్ కృష్ణయ్య, ఆర్ ఐ శ్రీధర్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.






