25 May, 2026 | 9:08 PM

సూర్యాపేట జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా భూమా శ్రీనివాసరావు నియామకం

25-05-2026 08:08 PM

కోదాడ,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న పార్టీ నాయకుడు కోదాడ మండలం,అడ్లూరు గ్రామ నుంచి భూమా శ్రీనివాసరావును సూర్యాపేట జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా పార్టీ అధిష్టానం నియమించింది. సోమవారం ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భూమా శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు గుర్తింపుగా ఈ పదవి లభించిందని నాయకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి మరింత శక్తివంతంగా పనిచేస్తానని భూమా శ్రీనివాసరావు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో భారతీయ జనతా పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు పార్టీ సిద్ధాంతాలను చేరవేయడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ నియామకంతో పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది.