27 July, 2026 | 2:52 PM

మీ నాన్నగారితో చెప్పించండి

27-07-2026 01:51 PM
  1. భూపాలపల్లి బిఆర్ఎస్ అభ్యర్థి నేనేనని 
  2. పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేసే కుట్ర చేస్తున్నారు
  3. భూపాలపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు 

గణపురం,జులై 27 (విజయక్రాంతి): మీరు చెప్పడం కాదు మీ నాన్న సిరికొండ మధునాచారితో వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి బిఆర్ఎస్ అభ్యర్థి నేనేనని చెప్పించాలని భూపాలపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు అన్నారు. సోమవారం గణపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మండలి విపక్ష నేత సిరికొండ మధుసూనా చారి కుమారుడు సిరికొండ ప్రశాంత్ ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేసే విధంగా మాట్లాడారని భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేసిన నాయకుడే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని టికెట్ తనకే వస్తుందని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

త అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే గందరగోల పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిందని అన్నారు. గతంలోనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో అన్ని విషయాలు వెల్లడించారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కి భూపాలపల్లి పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారని అన్నారు. అదేవిధంగా ప్రజల్లో మంచి పేరున్న సిరికొండ మధుసూదనా చారికి పార్టీలో సముచిత స్థానం కల్పించి వారి సేవలను వినియోగించుకుంటామని కార్యకర్తల సమావేశంలో ప్రకటించిన విషయం సిరికొండ ప్రశాంత్ మరిచిపోయారని అన్నారు.

ఇప్పటికైనా తమ తీరును మార్చుకొని కార్యకర్తల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేయొద్దని పోలుసాని లక్ష్మీనరసింహారావు హితవుపలికారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, పరశురాంపల్లి సర్పంచ్ ఉడుత సాంబయ్య యాదవ్, అంపోజ్వాల రవీందర్ రెడ్డి, పేరాల దేవేందర్ రావు, బొట్ల స్వామి, పల్లెబోయిన సదయ్య, గాజర్ల చింటూ గౌడ్, మామిండ్ల సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.