27 July, 2026 | 3:01 PM

నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన నకిరేకల్ ఎమ్మెల్యే

27-07-2026 02:26 PM

కట్టంగూర్ జులై 27(విజయక్రాంతి): కట్టంగూర్ మండలం మల్లారం గ్రామ నూతన  గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. అనంతరం గ్రామ మహిళల అభ్యున్నతికి దోహదపడే నూతన మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ భవనాలు ప్రజలకు మెరుగైన సేవలు అందించే కేంద్రాలుగా నిలవాలని, మహిళా సమాఖ్య భవనం ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు మరింత బలం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.