రామాలయ కమిటీ లెక్కలు చూపేందుకు సిద్ధం
27-07-2026 01:49 PM
బోథ్, జులై 27 (విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలోని రామాలయ కమిటీ లెక్కలను చూపించేందుకు తాను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నానని సోనాల రామాలయ కమిటీ అధ్యక్షుడు సుభాష్ సూర్య తెలిపారు. తాను పదవిలో కొనసాగినప్పటినుండి లెక్కలు అన్నీ ఉన్నాయని పేర్కొన్నారు. రామాలయానికి రాజకీయరంగు పులుమ వద్దన్నారు. అయితే తాను మాత్రం గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నికలు అయ్యేంతవరకు కొనసాగుతాన ని వివరించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నికల అనంతరం రామాలయ కమిటీ అధ్యక్షుని ఎన్నిక జరగాలని ఆయన పేర్కొన్నారు.






