7 July, 2026 | 7:32 PM

Breaking News

డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •  

బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

26-06-2025 12:29 AM
  1. నిందితుల నుంచి రూ.30 లక్షలవిలువచేసే 15 బైకులు స్వాధీనం

వివరాలు వెల్లడించిన మాదాపూర్ జోన్ అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్

శేరిలింగంపల్లి,జూన్ 25:సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను మియాపూర్ పోలీసులు రట్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను మా దాపూర్ జోన్ అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

చదువు మానేసిమద్యానికి బానిసగా మారిన నలుగురుశ్రీకాంత్, కుంభ వెంకటేశ్వర్లు,నల్లగొండ వేణు, ఎరువా గంగాధర్ లు చోరీల బాట పట్టారు. ఆయా కాలనీలో హ్యాండిల్ లాక్ లేని ద్విచక్ర వాహనాలే వీళ్ళ టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. చోరీ చేసిన ద్విచక్ర వాహనాలను పక్కా రాష్ట్రం ఆంధ్రా ప్రదేశ్ కు తీసుకెళ్లి అ మ్మేస్తున్నారు.. అదేవిధంగావాహనాల విడిభాగాలను కుడా అమ్ముతున్నారు.

నిందితులపై కమిషనరేట్ పరిధిలోని బేగంపేట్,కేపిఎచ్ బీ, చందానగర్,మాదాపూర్, మియాపూర్ పోలీస్ స్టేషన్ లలో పలు కేసులు నమోదు అయ్యాయి. రూ. 30 లక్షల విలువైన 15 బైక్ లను స్వాధీనం చేసుకొని 4 గురు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు డీసీపీతెలిపారు..