7 July, 2026 | 6:27 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడుతున్న ప్రైవేట్ పాఠశాలలు   •   "సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •  

స్థానికసంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

26-06-2025 12:28 AM

బీఎస్పీ జిల్లా ఇంచార్జి దొడ్డి శ్రీనివాస్ 

షాద్ నగర్, జూన్ 25: స్థానిక సంస్థలు రానున్న నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీఎస్పీ జిల్లా ఇన్చార్జ్ దొడ్డి శ్రీనివాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బుధవారం నియోజకవర్గ కేంద్రంలో అసెంబ్లీ అధ్యక్షుడు సొంటె శ్రీనివాస్ అధ్యక్షతన బీఎస్పీ పార్టీ సమావేశం నిర్వహించారు.

సమావేశానికి ముఖ్య అతిథి గా రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ దొడ్డి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు గుండేటి నర్సింలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన పలు అంశాలను చర్చించారు. స్థానిక సంస్థలు త్వరలో జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం దిశగా తీసుకెళ్లాలని సూచించారు.

అనంతరం షాద్నగర్ అసెంబ్లీ కార్యదర్శిగా కమ్మదనం గ్రామానికి చెందిన కొండేటి మహేందర్ ను ఏకగ్రీవంగా నియమించి, జిల్లా నాయకుల సమక్షంలో నియోజకవర్గ అధ్యక్షులు సొంటె శ్రీనివాస్ లు నియామక పత్రం అందజేశారు. పార్టీ నియమ, నిబంధనలను అనుసరిస్తూ ప్రోటోకాల్ ను పాటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

అసెంబ్లీ కార్యదర్శిగా నియమితులైన కొండేటి మహేందర్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు అప్పజెప్పిన పార్టీపథాధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి తుప్పరి కుమార్, ఫరూక్ నగర్ మండల అధ్యక్షులు శివగల ఆంజనేయులు, నాయకులు కొండేటి శరత్ చమార్ తదితరులుపాల్గొన్నారు.