17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ప్రభుత్వ భూమిలో ఆక్రమణల తొలగింపు

26-06-2025 12:31 AM
  1. భూమిని తనఖా పెట్టిన అసైన్డ్ లబ్ధిదారుడు  

భూమి చుట్టూ ప్రీ క్యాస్ట్ నిర్మించిన బ్యాంకు అధికారులు 

సర్కారు భూమి అంటూ బోర్డు ఏర్పాటు చేసిన అధికారులు 

రాజేంద్రనగర్, జూన్ 25: ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఈ ఘటనకు సంబంధించి శంషాబాద్ తహసీల్దార్ రవీందర్ దత్ మీడియాకు వెల్లడించారు. మండల పరిధిలోని మదనపల్లిలో సర్వేనెంబర్ 50లో సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో కొందరికి అందులో లావుని పట్టాలు ఇచ్చారు.

ఇదిలా ఉండగా ఇటీవల కొన్ని రోజుల క్రితం బ్యాంకు అధికారులు సుమారు రెండున్నర ఎకరాల భూమికి ప్రీ క్యాస్ట్ వాల్ నిర్మించారు. ఈ విషయమై శంషాబాద్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు అందింది. ఘటనపై విచారణ జరిపించగా గతంలో లావుని పట్టా తీసుకున్న ఓ వ్యక్తి సదరు భూమిని ఓ బ్యాంకులో తనఖా పెట్టాడు. అతడు డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఆ భూమికి ప్రీ క్యాస్ట్ ఏర్పాటు చేశారు.

బుధవారం శంషాబాద్ తాసిల్దార్ రవీందర్ దత్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని ఫ్రీ క్యాస్ట్ నిర్మాణాలను కూల్చివేశారు. ఇది ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అందజేసిన భూములకు సంబంధించి ఎలాంటి దావాదేవీలు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని తహసిల్దార్ రవీందర్ హెచ్చరించారు. ఎలాంటి క్రయవిక్రయాలు చెల్లవని ఆయనస్పష్టంచేశారు.