19-10-2025 06:19:33 PM
ములకలపల్లి (విజయక్రాంతి): పాల్వంచలోని సుగుణ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యని జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు, ములకలపల్లి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు బిక్కుమల్ల సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేసినట్లు తెలిపారు. తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఒకవేళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటే వారి విజయానికి కృషి చేయాల్సిందిగా తనకు సూచించారని బిక్కుమల్ల సుధాకర్ ఇక్కడ విలేకరులకు తెలిపారు.