19-10-2025 06:23:11 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): బీసీ బంద్ కు సహకరించిన అన్ని వర్గాల వ్యాపారులకు, కుల బాంధవులకు, అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బీసీ బంద్ లో పాల్గొని బీసీల సత్తా చాటి విజయవంతం చేసిన అన్ని పార్టీల నాయకులకు, కార్యకర్తలకు మనోజ్ గౌడ్ ఆదివారం ఉద్యమాభి వందనాలు తెలిపారు.