నాడు.. నార్వేలో" గ్లోబల్ సీడ్ వాల్ట్"..రేపు.. చంద్రుడి మీద "బయో వాల్ట్".. ప్రళయ కాల ఏర్పాట్లు !
న్యూయార్క్: కల్కి 2989 సినిమాలో చూపించినట్లు పూర్తి స్థాయిలో.. భూమ్మీద జీవులన్నీ మనుషులతో సహా మనుషుల కారణంగానే.. యుద్ధాల కారణంగానో.. గ్లోబల్ వార్మింగ్ కారణంగానో జీవ జాతుల మనుగడకు ప్రమాదం ఏ ర్పడితే ఎలా? ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్ ఇవన్నీచూస్తోంటే నిజమోనేమో అనిపిస్తంది కదా? భూ పర్యావరణాలకు మళ్లీ పురుడు పోసేలా శాస్త్రవేత్తలు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ ప్రాజెక్టు పేరే చంద్రుడి మీద బయో వాల్ట్. బయో వాల్ట్ పేరుతో స్మిత్సోనియన్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన నేషనల్ జూ సముద్ర జీవ శస్త్రవేత్త డాక్టర్ మేరీ హేజ్ డార్న్ పరిశోధనలు చేస్తున్నారు. పగడాలు, వాటి బీజ కణాలు, లార్వాను అతి శీతల స్థితిలో భద్ర పరచడానికి (క్రయోప్రిజర్వింగ్) చర్యలు చేపడుతున్నారు. వచ్చే శతాబ్దం 2100 ఏడీ కల్లా భూమ్మీద నివసించే ప్రతి ఐదు జీవులలో ఒకటి కనుమరుగయ్యే అవకాశముందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) పేర్కొంటోంది.






